: డిమోనిటైజేషన్, గోల్డ్ కంట్రోల్ పై రేపు ట్వీట్ చేస్తా: పవన్ కల్యాణ్
ఏపీకి ప్రత్యేక హోదాపై హామీ ఇచ్చిన బీజేపీ, ఆ హామీని నెరవేర్చేవరకు విశ్రమించేది లేదని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నిన్న తన ట్విట్టర్ ఖాతా ద్వారా పేర్కొన్న విషయం తెలిసిందే. పలు అంశాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న పవన్, తాజాగా, మరో ట్వీట్ చేశారు. పెద్దనోట్ల రద్దు, బంగారంపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్ననిర్ణయాలపై తన అభిప్రాయాలను రేపు తెలియజేస్తానని, ఈ అంశాలపై ట్వీట్ చేయడాన్నిరేపటితో ముగిస్తానని ఆ ట్వీట్ లో పవన్ పేర్కొన్నారు. కాగా, ‘జై ఆంధ్ర ఉద్యమం’లో అసువులు బాసిన విద్యార్థులపై ప్రమాణం చేసి చెబుతున్నానని, ఏపీకి ప్రత్యేక హోదా వచ్చే వరకు తమ పోరాటం ఆగదని పవన్ నిన్న ట్వీట్ లో పేర్కొన్నాడు.