: పర్సనల్ యాప్ ను విడుదల చేసిన సల్మాన్ ఖాన్


బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ తన పర్సనల్ యాప్ ను విడుదల చేస్తున్నాడు. ఈ నెల 27న తన బర్త్ డేను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు సల్మాన్ ఇప్పటికే పక్కాగా ప్లాన్ చేసుకున్నాడు. ఈ సందర్భంగా యాప్ ను రీలీజ్ చేయనున్నాడు. ఈ విషయాన్ని ట్విట్టర్లో తెలిపాడు. ఈ సందర్భంగా తలపై క్యాప్, బీయింగ్ హ్యూమన్ పేరుతో ఉన్న జాకెట్ ధరించిన ఫొటోను అప్ లోడ్ చేశాడు. 'మీ కోసమే నా భర్త్ డే యాప్' అని పేర్కొన్నాడు. ఈ యాప్ ద్వారా తన అభిమానులతో ఎప్పటికప్పుడు కొత్త విషయాలను పంచుకోనున్నాడు సల్లూ భాయ్. 

  • Loading...

More Telugu News