: ఎయిమ్స్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సుష్మాస్వరాజ్
కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ నెల 10వ తేదీన ఆమెకు కిడ్నీ మార్పిడి చికిత్సను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆపరేషన్ అయిన తర్వాత ఆమె కోలుకోవడంతో... వైద్యులు ఆమెను డిశ్చార్జ్ చేశారు. గత 20 ఏళ్లుగా సుష్మాస్వరాజ్ మధుమేహ వ్యాధితో బాధపడుతున్నారు. నవంబర్ 7న ఆమె కిడ్నీలు విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో, ఆమెకు కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ ఆపరేషన్ జరిగింది.