: ఆరు నెలల ముందుగానే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లే యోచనలో బీజేపీ


ఆరు నెలల ముందుగానే గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలను నిర్వహించే యోచనలో బీజేపీ ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆర్ఎస్ఎస్, బీజేపీ టాప్ కేడర్ లో ఈ టాపికే నడుస్తోంది. షెడ్యూల్ ప్రకారమైతే, వచ్చే ఏడాది డిసెంబర్ లో గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు జరగాలి. కానీ, ఆరు నెలల ముందుగానే ఎన్నికలకు వెళ్లే యోచనలో అధిష్ఠానం ఉందని ఓ సీనియర్ బీజేపీ నేత తెలిపారు. గుజరాత్ బీజేపీలో సమూల మార్పులు తీసుకొచ్చే దిశగా అధిష్ఠానం భావిస్తోందని సమాచారం.

అలాగే రానున్న ఎన్నికల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి విజయ్ రూపానిని కాకుండా... ఓబీసీకి చెందిన అభ్యర్థిని సీఎం అభ్యర్థిగా ప్రకటించే ఆలోచనలో కూడా బీజేపీ ఉన్నట్టు తెలుస్తోంది. ఓబీసీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం ద్వారా కాంగ్రెస్, ఆప్ లకు చెక్ పెట్టవచ్చని బీజేపీ అధిష్ఠానం భావిస్తోంది. గుజరాత్ లో 45 శాతం మంది ఓబీసీలే ఉన్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రకటన జనవరి చివరి వారంలో వెలువడే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News