: రూ. 5 వేలు దాటితే ఒక్కసారి మాత్రమే డిపాజిట్ కు చాన్స్... బాంబేసిన మోదీ సర్కారు
ఇంకా ఎవరి దగ్గరైనా పాత కరెన్సీ నోట్లు ఉండి, వాటిని బ్యాంకులో డిపాజిట్ చేయాలని భావిస్తున్న వారికి షాకిచ్చే నిర్ణయమిది. ఈ నెల 30 వరకూ పాత నోట్ల డిపాజిట్ కు సమయం ఉందన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రూ. 5 వేలకు మించిన నగదు డిపాజిట్ చేయాలనుకుంటే, నెలాఖరులోగా ఒక్కసారి మాత్రమే అవకాశం ఇస్తామని ఈ ఉదయం కేంద్రం ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ మేరకు బ్యాంకు డిపాజిట్ దారులకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కొత్త నిబంధన విధించింది. ఇక పాత నోట్లను ఇంత ఆలస్యంగా ఎందుకు డిపాజిట్ చేస్తున్నారన్న బ్యాంకు అధికారుల ప్రశ్నలకు సైతం సమాధానం చెప్పాల్సి వుంటుంది. ఆ సమాధానం అధికారులకు నచ్చితేనే డిపాజిట్ ను తీసుకుంటారని కూడా ఆర్థిక శాఖ వెల్లడించింది.