: రాసలీలల మాజీ మంత్రి నుంచి తనకు ప్రాణహాని ఉందన్న విజయలక్ష్మి


ఓ పని గురించి తన వద్దకు వచ్చిన విజయలక్ష్మి అనే మహిళపై కర్ణాటక రాష్ట్ర మాజీ మంత్రి మేటి రాసలీలలు జరిపిన వీడియో లీక్ అయిన విషయం తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. రాసలీలలు బహిరంగమైనప్పటి నుంచి బాధితురాలు విజయలక్ష్మి అజ్ఞాతంలోనే గడుపుతోంది. తాజాగా మాజీ మంత్రి మేటి నుంచి తనకు ప్రాణ హాని ఉందంటూ బాగల్కోటెలోని పోలీస్ స్టేషన్ లో ఆమె పిర్యాదు చేసింది. నలుగురు వ్యక్తులు తనను బెదిరిస్తున్నారంటూ ఫిర్యాదులో పేర్కొంది. డీఏఆర్ కానిస్టేబుల్ సుభాష్, మారుతి మీరజ్కర్, అశోక్ లాగలోటె, సిద్దలింగ అబలగట్టిలు తనను బెదిరిస్తున్నారని ఆరోపించింది. మరోవైపు, ఈ వీడియో సీడీని విడుదల చేసిన ఆర్టీఐ కార్యకర్త రాజశేఖర్ కూడా మేటి అనుచరుల నుంచి తనకు ప్రాణ హాని ఉందంటూ బళ్లారిలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. 

  • Loading...

More Telugu News