: రాహుల్ ప్రభావం ఇది... ఆయన రాగానే, వారి ఎమ్మెల్యే రాజీనామా చేశారు: గోవా ముఖ్యమంత్రి ఎద్దేవా
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై గోవా ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ సెటైర్లు విసిరారు. రాష్ట్రంలో రాహుల్ గాంధీ అడుగుపెట్టగానే పలువురు నేతలు కాంగ్రెస్ ను వీడి వెళ్లిపోతున్నారని ఎద్దేవా చేశారు. మొదటి రోజు ఒక ఎమ్మెల్యే రాజీనామా చేశారని చెప్పారు. 17వ తేదీన కాంగ్రెస్ ఎమ్మెల్యే మౌవిన్ గోడిన్హో రాజీనామా చేసి బీజేపీలో చేరారు. రెండో రోజు ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి మనోహర్ వెళ్లిపోయారని... ఇంకా ఎంత మంది కాంగ్రెస్ పార్టీని వీడుతారో చెప్పలేమని తెలిపారు. మనోహర్ ఎంజీపీలో చేరారు. తన ర్యాలీకి కనీసం 50 వేల మందిని తీసుకురావాలని కాంగ్రెస్ శ్రేణులకు రాహుల్ సూచించారని... అయినా, కొన్ని వేల మంది మాత్రమే వచ్చారని అన్నారు.