: శ్రీకాకుళం జిల్లాలో నడిరోడ్డుపై దగ్ధమైన ఆర్టీసీ బస్సు


శ్రీకాకుళం జిల్లాలో పెనుప్రమాదం తృటిలో తప్పింది. రణస్థలం మండలం నెలివాడ వద్ద నడిరోడ్డుపై ఆర్టీసీ బస్సు దగ్థమైంది. బస్సు ఇంజన్ లో మంటలు చెలరేగి, క్షణాల్లో బస్సంతటినీ అవి వ్యాపించినట్టు ప్రయాణికులు వెల్లడించారు. శ్రీకాకుళం నుంచి రాజమహేంద్రవరం వెళుతున్న ఈ బస్సుకు ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉండగా, వారంతా ప్రాణాలతో బయటపడ్డట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగి ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.

  • Loading...

More Telugu News