: ఆదివారం శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.67 కోట్లు


కిటకిటలాడేంత రద్దీ లేనప్పటికీ, తిరుమల శ్రీవారి ఆదాయం రికార్డు స్థాయికి నమోదవుతోంది. నిన్న ఆదివారం నాడు హుండీ ఆదాయం రూ. 2.67 కోట్లు వచ్చినట్టు టీటీడీ అధికారులు పేర్కొన్నారు. మొత్తం 78,752 మంది భక్తులు స్వామి వారిని దర్శనం చేసుకున్నారని, 30,424 మంది తలనీలాలు సమర్పించారని తెలిపారు. ఇదిలావుండగా, ఈ ఉదయం తిరుమలలో రద్దీ సాధారణంగా ఉంది. స్వామి దర్శనం నిమిత్తం 2 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. సర్వదర్శనానికి 3 గంటల సమయం, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. కాలినడకన వచ్చిన భక్తులకు దర్శనానికి 3 గంటల సమయం పడుతున్నట్టు అధికారులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News