: హనుమాన్ జంక్షన్‌లో ప్రైవేటు బస్సు బీభత్సం.. ప్రయాణికులకు తప్పిన ముప్పు


శ్రీకృష్ణ ట్రావెల్స్‌కు చెందిన బస్సు బీభత్సం సృష్టించింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు కృష్ణాజిల్లా హనుమాన్ జంక్షన్ వద్ద ఒక్కసారిగా అదుపు తప్పి ఆటోను, రోడ్డుపక్కనున్న షాపును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటో, షాపు పూర్తిగా ధ్వంసమయ్యాయి. పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపరి పీల్చుకున్నారు. ప్రమాదంతో బెంబేలెత్తిన ప్రయాణికులు బస్సు దిగి ప్రాణాలు రక్షించుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంపై ఆరా తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News