: ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
హైదరాబాద్‌లోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రైవేటు యూనివర్సిటీ బిల్లును వ్యతిరేకిస్తున్న విద్యార్థి సంఘాలు ఈ రోజు ఎమ్మెల్యే క్వార్టర్స్ ముట్టడికి పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద భారీగా పోలీసులను మోహరించారు. పోలీసుల మోహరింపుతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులను మోహరించినా నిరసన తెలిపే తీరుతామని, ముట్టడి కొనసాగుతుందని విద్యార్థులు తేల్చి చెబుతున్నారు. ప్రైవేటు యూనివర్సిటీ బిల్లును ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోమని విద్యార్థి సంఘాలు స్పష్టం చేశాయి.