: ‘షియోమీ’ వినియోగదారులకు శుభవార్త.. త్వరలో నూగట్ అప్‌డేట్


షియోమీ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు శుభవార్త. ఆ కంపెనీ ఫోన్లు ఎంఐ మ్యాక్స్, ఎంఐ నోట్, ఎంఐ 4సి, ఎంఐ 4ఎస్ ఫోన్లు త్వరలో ఆండ్రాయిడ్ కొత్త ఆపరేటింగ్ సిస్టం(ఓఎస్) 7.0 నూగట్‌తో అప్‌డేట్ కానున్నాయి. ఈ మేరకు కంపెనీ ప్రకటించింది. అయితే ఈ అప్‌డేట్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందన్న విషయాన్ని కచ్చితంగా చెప్పకపోయినప్పటికీ వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల మార్కెట్లోకి వచ్చిన ఎంఐ 5కి అప్‌డేట్ వచ్చిన విషయం తెలిసిందే. కంపెనీ తాజా ప్రకటనతో షియోమీ వినియోగదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

  • Loading...

More Telugu News