: మంద కృష్ణ మాదిగ డిమాండ్‌లో న్యాయముంది.. బీహార్ సీఎం నితీశ్‌కుమార్


ఎస్సీ ఉపకులాల జనాభా ప్రకారం రిజర్వేషన్ల పంపిణీ జరగాలన్న ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్‌లో న్యాయం ఉందని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అన్నారు. ఆదివారం మంద కృష్ణ పట్నాలో నితీశ్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణ అవసరాన్ని, ఉద్యమం జరుగుతున్న తీరును ఆయనకు వివరించారు. తనకు మద్దుతుగా నిలవాలని కోరారు. దీనికి స్పందించిన సీఎం మాట్లాడుతూ మంద కృష్ణ డిమాండ్‌లో న్యాయం ఉందని పేర్కొన్నారు. దళితుల్లో ఉన్న అసమానతలను తగ్గించేందుకు బీహార్‌లో  దళిత్-మహాదళిత్‌గా వర్గీకరించినట్టు తెలిపారు. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత లభిస్తే ఫలితాలు అద్భుతంగా ఉంటాయన్నారు. వర్గీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని కోరుతూ ప్రధాని మోదీకి లేఖ రాస్తానని మంద కృష్ణకు నితీశ్ హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News