: టెక్కలి ఏరియా ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత.. యువకుడి మృతికి వైద్యులే కారణమంటూ ఆస్పత్రిపై బంధువుల దాడి
శ్రీకాకుళం జిల్లా లోని టెక్కలి ఏరియా ఆస్పత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువకుడి మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ బంధువులు దాడికి దిగారు. ఆస్పత్రి అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. నినాదాలతో హోరెత్తించారు. దీంతో ఆస్పత్రి పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సర్దిచెప్పడంతో గొడవ సద్దుమణిగింది.