: శామీర్ పేట్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం


ఔటర్ రింగ్ రోడ్డుపై మరో ఘోర ప్రమాదం జరిగింది. మేడ్చల్ జిల్లా శామీర్ పేట్ మండలం దొంగలమైసమ్మ చౌరస్తా వద్ద  జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. కండ్లకోయ నుంచి శామీర్ పేట వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు, సంఘటనా స్థలానికి వెళ్లారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను తరలించారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News