: భార్యాభర్తలుగా జీవించేందుకు ‘పెళ్లి’ బంధమే అక్కర్లేదు: నికిషా పటేల్
భార్యాభర్తలుగా జీవించేందుకు ‘పెళ్లి’ బంధమే అక్కర్లేదని ‘పులి’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన నికిషా పటేల్ అభిప్రాయపడింది. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఆమె మాట్లాడుతూ, త్వరలోనే అగ్ర హీరోల సరసన నటిస్తాననే నమ్మకం తనకు ఉందని చెప్పింది. పెళ్లి గురించి ప్రశ్నించగా.. ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని, అయినా, భార్యాభర్తలుగా జీవించాలంటే పెళ్లి బంధమే అక్కర్లేదని నికిషా పటేల్ తన అభిప్రాయం వ్యక్తం చేసింది. వైవాహిక జీవితం అనుభవిస్తున్న ప్రతిఒక్కరూ సంతోషంగా ఉన్నారని చెప్పలేమని, 2030 సంవత్సరం నాటికి మనదేశంలో ‘పెళ్లి’ స్థానే ‘సహజీవనం’ పెరుగుతుందని చెప్పిన నికిషా, తనకు నచ్చిన వ్యక్తితోనే సహజీవనం చేస్తానని చెప్పింది. కాగా, ప్రస్తుతం గౌతం దర్శకత్వంలో తెరకెక్కుతున్న తమిళ చిత్రం ‘7 నాట్కల్’ లో నికిషా పటేల్ నటిస్తోంది.