: వైఎస్సార్సీపీ అధినేత జగన్ కు సవాల్ విసిరిన టీడీపీ నేత యరపతినేని


వైఎస్సార్సీపీ అధినేత జగన్ కు టీడీపీ నేత, గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు సవాల్ విసిరారు.  ప్రతిపక్షనేతగా జగన్ అనర్హుడని, పులివెందుల రాజకీయాలు పల్నాడులో సాగవని ఆయన విమర్శించారు. గురజాల నియోజకవర్గం నుంచి జగన్ పోటీ చేయాలని, తాను కనుక ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని, జగన్ ఓడిపోతే వైఎస్సార్సీపీని మూసేస్తారా? అని యరపతినేని సవాల్ విసిరారు. వైఎస్సార్సీపీలో కాసు మహేశ్ రెడ్డి చేరిన సందర్భంగా నరసరావుపేటలో ఇటీవల నిర్వహించిన బహిరంగ సభలో తనపై జగన్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు చెప్పారు. సరస్వతి భూముల్లో సాగు చేసుకుంటున్న రైతులపై దాడి చేయించింది జగనేనని ఆరోపించారు.

  • Loading...

More Telugu News