: ఏడెన్ లో ఆత్మాహుతి దాడి... 30 మంది సైనికుల దుర్మరణం


యెమెన్ లోని ఏడెన్ పట్టణంలో ఉగ్రవాదులు రక్తపాతాన్ని సృష్టించారు. ఈ రోజు ఉదయం జరిగిన ఆత్మాహుతి దాడిలో 30 మంది వరకు సైనికులు మృత్యువాతపడ్డారు. అలాగే, మరింత మంది గాయపడినట్టు సమాచారం. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు 50 మంది సైనికులను బలి తీసుకున్న వారం రోజుల్లోనే మరోసారి దాడి చోటు చేసుకోవడం గమనార్హం. తమ వేతనాలను తీసుకునేందుకు ఆల్ సోల్బన్ బేస్ వద్ద సైనికులు భారీ సంఖ్యలో గుమికూడి ఉన్నారు. అదే సమయంలో ఒంటి నిండా పేలుడు పదార్థాలను అమర్చుకుని వచ్చిన ఓ వ్యక్తి సైనికుల సమూహంలోకి చొరబడి తనను తాను పేల్చేసుకున్నాడు. ఇస్లామిక్ ఉగ్రవాదులపై సైనిక బలగాలు కొన్ని నెలలుగా తమ పోరాటాన్ని ఉద్ధృతం చేయడంతో... ముష్కరులు వారి నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు ఈ విధంగా దాడులకు పాల్పడుతున్నారు. 

  • Loading...

More Telugu News