: ఒసామా బిన్ లాడెన్ కుమారుడికి చేదు అనుభవం... ఈజిప్టులోకి నో ఎంట్రీ
ఒసామా బిన్ లాడెన్ కుమారుడు ఒమర్ బిన్ లాడెన్ తమ దేశంలో కాలు పెట్టకుండా ఈజిప్టు అడ్డుకుంది. కైరో అంతర్జాతీయ వినానాశ్రయానికి వచ్చిన అతడ్ని, అతడి భార్యను అక్కడి నుంచి అటే వెనక్కి పంపేసింది. ఒమర్ బిన్ లాడెన్ నిషేధిత వ్యక్తుల జాబితాలో ఉండడమే ఇందుకు కారణమని విమానాశ్రయ అధికారులు స్పష్టం చేశారు. ఒమర్ బిన్ లాడెన్ (34) ఒసామా బిన్ లాడెన్ నాలుగో పెద్ద కుమారుడు. బ్రిటన్ కు చెందిన తన భార్య జైనా ఆల్ సభాహ్ తో కలసి దోహా నుంచి కైరోకి రాగా ఈ పరిణామం చోటు చేసుకుంది. ఒసామా బిన్ లాడెన్ పిల్లలు అందరూ ఈ ప్రపంచంలో మంచి పౌరులుగా జీవించాలని అనుకుంటున్నారని... కానీ బిన్ లాడెన్ పిల్లలు అనే కళంకం వారికి ప్రతిబంధకంగా మారిందని ఒమర్ గతంలో ఓ సారి అవేదన వ్యక్తం చేశాడు.