demonitisation: కూలీ బ్యాంకు ఖాతాలో ఏకంగా కోటి పదివేల రూపాయలు పడ్డాయి!


కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంతో ప్రజలు పెద్ద ఎత్తున బ్యాంకుల వద్దకు వచ్చి తమ వద్ద ఉన్న పాతనోట్లను డిపాజిట్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్ర‌మంలో బ్యాంకు సిబ్బంది ఒత్తిడికి గుర‌వుతున్నారు. కొన్ని చోట్ల తిక‌మ‌క ప‌డుతూ ఖాతాదారుల డ‌బ్బు జ‌మ వివ‌రాల‌ను త‌ప్పుగా న‌మోదు చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఓ ఆటో డ్రైవ‌ర్ బ్యాంకు ఖాతాలో కోట్ల రూపాయ‌లు ప‌డిన‌ట్లు వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. తీరా ఆరా తీస్తే బ్యాంకు సిబ్బంది చేసిన‌ పొర‌పాటు వ‌ల్లే అత‌డి ఖాతాలో అంత‌డ‌బ్బు ప‌డిన‌ట్లు త‌ప్పుగా న‌మోద‌యింద‌ని తెలిసింది. తాజాగా మధ్యప్రదేశ్‌లో ఆశారాం విశ్వకర్మ అనే ఓ రోజువారి కూలీ ఖాతాలో ఏకంగా రూ. కోటి పదివేలు వ‌చ్చిప‌డ్డాయి. ఆ రాష్ట్రంలోని హోషంగాబాద్‌లోని ఖిదియా బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా శాఖలో అత‌డికి ఖాతా ఉంది.

పెద్ద మొత్తంలో జ‌రుగుతున్న లావాదేవీల‌పై నిఘా పెట్టిన ఆదాయ‌ప‌న్ను శాఖ అధికారులు ఖిదియా బ్యాంకు ఖాతాలో ఇంత‌ మొత్తంలో న‌గ‌దు జ‌మ అవడంతో గత నెల‌ 30న  నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న ఖిదియాకు ఇంగ్లిష్ అర్థం కాక ఇబ్బంది ప‌డ్డాడు. అనంత‌రం ఓ స్థానిక టీచర్ సాయంతో త‌న ఖాతాలో కోటి ప‌దివేల రూపాయ‌లు ప‌డ్డాయ‌ని, దీంతో అత‌డికి ఐటీ నుంచి నోటీసులు వ‌చ్చాయ‌ని తెలుసుకున్నాడు. దీంతో వెంట‌నే బ్యాంకుకు వెళ్లి సిబ్బందిని అడిగాడు. దీంతో అస‌లు విష‌యం తెలిసింది. పెద్ద‌నోట్ల రద్దు తర్వాత విశ్వకర్మ తన ఖాతాలో పదివేలు మాత్రమే డిపాజిట్‌  చేశారని, అయితే బ్యాంకు సిబ్బంది చేసిన పొర‌పాటు వ‌ల్ల అత‌డి ఖాతాలో  కోటి ప‌దివేల రూపాయ‌లు ప‌డ్డాయ‌ని తెలుసుకున్నాడు.

ఈ ఘ‌ట‌న‌ను గురించి స‌ద‌రు బ్యాంకు మేనేజ‌ర్ వివ‌రిస్తూ... విశ్వ‌క‌ర్మ‌ నిజానికి పాత‌ 500 నోట్లు 20 డిపాజిట్ చేశాడ‌ని అయితే,  20 వేల 500 నోట్లు డిపాజిట్‌ చేసినట్టు త‌మ సిబ్బంది అత‌డి ఖాతాలో తప్పుగా పేర్కొన్నారని, ఈ పొరపాటు గురించి తాము ఆదాయ‌ప‌న్ను శాఖ‌ అధికారులకు తెలియజేశామని చెప్పారు.

  • Loading...

More Telugu News