radio: శాస్త్రవేత్తల మరో ఘనత.. ప్రపంచంలోనే అత్యంత చిన్న సైజు రేడియో


గులాబీ వర్ణపు వజ్రాల్లో పరమాణు స్థాయి లోపాలను ఆసరాగా చేసుకొని శాస్త్ర‌వేత్త‌లు అత్యంత బుల్లి రేడియో రిసీవ‌ర్‌ను త‌యారుచేసి మ‌రో ఘ‌న‌త సాధించారు. దీన్ని రూపొందించ‌డానికి వాడిన ప‌దార్థాలు రెండు పరమాణువుల స్థాయిలోనే ఉండటం విశేషం. ఇందులో ఎన్నో ప్ర‌త్యేక‌తలు ఉన్నాయి. అత్యంత కఠిన వాతావరణ పరిస్థితులను తట్టుకోగలదు, శరీరంలో కలిసిపోయే బయోకంపాటిబుల్‌ లక్షణం సైతం ఈ బుల్లి రేడియో సొంతం. ఈ రేడియోను ప‌లు చోట్ల తేలిక‌గా అమ‌ర్చ‌వ‌చ్చు. శుక్ర గ్రహంపైకి పంపే వ్యోమనౌకల నుంచి గుండెలో అమర్చే పేస్‌ మేకర్‌ వరకూ ఎన్నో పరికరాల్లో ఈ బుల్లి రేడియోను వినియోగించ‌వ‌చ్చు. శాస్త్ర‌వేత్త‌లు ఈ రేడియో పరిశోధనలో భాగంగా 350 డిగ్రీల సెల్సియస్‌ వద్ద ఈ రేడియో నుంచి చ‌క్క‌ని మ్యూజిక్‌ని వినిపించారు.

  • Loading...

More Telugu News