: బాగుందనే టాక్ వచ్చిన సినిమాను తప్పకుండా చూస్తాను: నటుడు ఉపేంద్ర


బాగుందనే  టాక్ వచ్చిన ఏ సినిమానైనా తాను చూస్తానని దక్షిణాది నటుడు ఉపేంద్ర అన్నాడు. కన్నడ సినిమా ‘మమ్మి’ని తెలుగులో ‘చిన్నారి’ పేరిట విడుదల చేశారు. ఈ చిత్రంలో ప్రముఖ నటి, ఉపేంద్ర సతీమణి అయిన ప్రియాంక ప్రధాన పాత్ర పోషించింది. ఈ సందర్భంగా ఉపేంద్ర దంపతులు  ఒక న్యూస్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు.  తల్లీ, కూతురు మధ్య జరిగే కథగా దీనిని తెరకెక్కించారని, హర్రర్ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి కావాల్సిన ముఖ్య అంశాలన్నీ ఈ చిత్రంలో ఉన్నాయని ఉపేంద్ర అన్నారు.

తాను, ప్రియాంక కలిసే తెలుగు చిత్రంలో కూడా త్వరలో నటిస్తామని చెప్పారు. ‘ఎ’, ‘ఉపేంద్ర’,‘రక్తకన్నీరు’ వంటి సినిమాలే తనకు ఎంతో పేరు తెచ్చాయని అన్నారు. తెలుగు సినీ పరిశ్రమలో తనకు ఫలానా హీరో అంటే అభిమానమని చెప్పలేనని, ఎవరు బాగా నటిస్తే వాళ్లే తనకు నచ్చుతారని చెప్పారు. మొదటినుంచి తనకు సినిమాలు చూసే అలవాటు లేదని.. అయితే, ఫలానా సినిమా బాగుందనే టాక్ వస్తే మాత్రం.. తప్పకుండా వెళ్లి చూస్తానని, ‘బాహుబలి’ చిత్రం చూశానని చాలా బాగుందని ఉపేంద్ర చెప్పుకొచ్చారు. 

  • Loading...

More Telugu News