: కంఠీరవ స్టేడియం బాత్రూమ్ లో అసభ్య రాతలు...మండిపడుతున్న క్రీడాకారిణులు


బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలోని మహిళల బాత్రూమ్ లో అసభ్య రాతలు రాసి ఉండటంపై క్రీడాకారిణులు మండిపడుతున్నారు. అసభ్యకరంగా ఉన్న ఆ రాతలు చూసి చాలా క్షోభకు గురయ్యామని వాపోతున్నారు. ఆ రాతలు స్పోర్ట్స్ అథారిటీ పేరిట రాసి ఉండటంతో సంబంధిత అధికారులకు సీనియర్  క్రీడాకారిణులు, కోచ్ లు ఫిర్యాదు చేశారు. ఈ స్టేడియంలోకి ఇతరులు ప్రవేశించకుండా క్రీడాకారులకు గుర్తింపు కార్డులు కూడా జారీ చేశారని, అయితే వాష్ రూమ్ లోకి ఎవరు ప్రవేశించారని, ఈ అసభ్యకర రాతలు రాసింది ఎవరని క్రీడాకారిణులు ప్రశ్నిస్తున్నారు.  ఈ సంఘటన అనంతరం పలువురు తల్లిదండ్రులు తమ పిల్లలను స్టేడియానికి పంపించడం మాన్పించడం గమనార్హం.

  • Loading...

More Telugu News