: ఉత్తరప్రదేశ్ కు రూ. 5వేల కోట్ల కరెన్సీని పంపిన ఆర్బీఐ
దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ కి ఆర్బీఐ నేడు రూ. 5000 కోట్ల కరెన్సీని పంపించింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య, కార్గో విమానంలో ఈ డబ్బును తరలించింది. నోట్ల రద్దు తర్వాత ఉత్తరప్రదేశ్ లో కరెన్సీ కొరత తీవ్రంగా ఉండటంతో... ఈ భారీ మొత్తాన్ని పంపామని ఆర్బీఐ తెలిపింది. రాష్ట్రంలో పలు బ్యాంకుల వద్ద ఖాతాదారులు ఆందోళనకు దిగడం, పలు ప్రాంతాల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తడంతో ఆర్బీఐ ఉపశమన చర్యలను చేపట్టింది. రాష్ట్రంలోని ఆర్బీఐ కార్యాలయానికి చేరిన తర్వాత... ఈ కరెన్సీని వివిధ బ్యాంకులకు, ఏటీఎంలకు పంపిణీ చేయనున్నారు.