: పోయెస్ గార్డెన్ కు వెళ్లి శశికళను కలిసిన విజయశాంతి


దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళను ప్రముఖ సినీ నటి, మాజీ ఎంపీ విజయశాంతి ఈరోజు కలిశారు. జయ నివాసం పోయెస్ గార్డెన్ కు వెళ్లిన విజయశాంతి... శశికళతో భేటీ అయ్యారు. అన్నాడీఎంకే పార్టీని ముందుండి నడిపించాలని... జయ నిర్వహించిన బాధ్యతలను స్వీకరించాలని శశికళను ఈ సందర్భంగా విజయశాంతి కోరారు. అంతకు ముందు మెరీనా బీచ్ లోని జయలలిత సమాధిని విజయశాంతి దర్శించుకున్నారు. సమాధిపై పూలమాల వేసి, జయలలితకు అంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అమ్మ మృతి తీరని లోటు అని అన్నారు. 

  • Loading...

More Telugu News