: మా నాన్న ‘దేవుడు లాంటి మనిషి’: మహేష్ బాబు


తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ దేవుడిలాంటి మనిషని మహేశ్ బాబు అన్నాడు. కృష్ణ  పేరిట  ‘దేవుడు లాంటి మనిషి’ అనే పుస్తకాన్ని ఈరోజు విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని మహేష్ బాబు తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ‘‘దేవుడు లాంటి మనిషి’ పుస్తకాన్ని ఈరోజు విడుదల చేస్తున్నాం. మా నాన్నకి సరిగ్గా సరిపోయే టైటిల్ ఇది. ఈ పుస్తకం చదవడం కోసం ఆసక్తిగా ఎదరుచూస్తున్నాను’ అని ఆ ట్వీట్ లో పేర్కొన్న మహేష్, ఈ పుస్తకం కవర్ పేజీని కూడా పోస్ట్ చేశాడు. కాగా, 1969-2015 వరకు కృష్ణ సినీ జీవితాన్ని ఈ పుస్తకంలో ఆవిష్కరించినట్టు తెలుస్తోంది. 

  • Loading...

More Telugu News