: పులులు, సింహాలు అడవిలో ఉండాలి..జగన్ లాంటి వాళ్లు జైల్లో ఉండాలి: దేవినేని ఉమ


పులులు, సింహాలు అడవుల్లో ఉండాలి, జగన్ లాంటి వాళ్లు జైల్లో ఉండాలని ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వ్యాఖ్యానించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, సీఎం పదవి కోసమే జగన్ రాజకీయాలు చేస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరపున పోటీ చేసేందుకు అభ్యర్థులే ఉండరని అన్నారు. ఫ్యాక్షన్ రాజకీయాలు మానుకోవాలని, తాను చేస్తున్న ఆరోపణలపై బహిరంగ చర్చకు ఆయన సిద్ధమేనా? అని దేవినేని సవాల్ విసిరారు. ఏపీలో జగన్ ఆటలు సాగవని, అమరావతిలో రాజధాని నిర్మాణాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న జగన్, త్వరలో జరగబోయే ఏపీ అసెంబ్లీ  సమావేశాలకు ఏ మొహం పెట్టుకుని ఆయన హాజరవుతారని దేవినేని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News