: ఎవరికీ దక్కని గౌరవం నాకు దక్కింది: బాబు
రాష్ట్ర ప్రజలకు తానెంతో రుణపడి ఉంటానని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రస్తుతం బాబు 'బిగ్ డిబేట్' కార్యక్రమంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణతో మాట్లాడుతున్నారు. తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసే అవకాశం ఇవ్వడం ద్వారా ప్రజలు ఎవరికీ దక్కని గౌరవం తనకు ఇచ్చారని బాబు చెప్పారు. కాంగ్రెస్ రాష్ట్ర ప్రజలకు నమ్మకద్రోహం చేసిందని ఆరోపించారు. ప్రజలు కష్టాల్లో ఉన్న తరుణంలో రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందని బాబు చెప్పుకొచ్చారు. రాష్ట్రాభివృద్ధి టీడీపీ వల్లే సాధ్యమని ధీమా వ్యక్తం చేశారు. అయితే, తనకెప్పుడూ అధికారం ముఖ్యం కాదని చంద్రబాబు అన్నారు. అధికారం కన్నా రాష్ట్రాన్ని గట్టెక్కించడమే ప్రథమ ప్రాధాన్యత అని నొక్కి చెప్పారు.