: కృష్ణాజిల్లాలో తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్
ఓ కానిస్టేబుల్ తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఈ రోజు ఉదయం కృష్ణాజిల్లా గన్నవరం మండలం పురుషోత్త పట్టణంలో చోటుచేసుకుంది. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి పేరు డేవిడ్ రాజు అని, అతడు గన్నవరం పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు. డేవిడ్ రాజు ఆత్మహత్య ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డేవిడ్ రాజు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలపై వివరాలు తెలియాల్సి ఉంది.