: ఏపీకి రూ. 2500 కోట్లు విడుదల చేసిన ఆర్బీఐ
కరెన్సీ కష్టాలను అనుభవిస్తున్న ఏపీ ప్రజలకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ కు రూ. 2500 కోట్లను ఆర్బీఐ విడుదల చేసింది. ఇందులో రూ. 2000 కోట్లు 2000 నోట్లు... రూ. 500 కోట్లు 500 నోట్లు ఉన్నాయి. వెంటనే ఈ డబ్బును రాష్ట్రంలోని బ్యాంకులకు, ఏటీఎంలకు పంపిణీ చేయనున్నారు. ఈ డబ్బుతో ప్రజల కష్టాలు కొంతమేర తీరే అవకాశం ఉంది. అయితే, ఈ సొమ్ము పక్కదారి పట్టకుండా చూడాల్సిన అవసరం ఉంది.