: సింహం మీ మ‌ధ్య‌లో కూర్చుంది!: బాల‌కృష్ణ‌ను ఉద్దేశించి దర్శకుడు క‌్రిష్


తాను న‌టిస్తోన్న‌ 'గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి' సినిమా ట్రైల‌ర్ ను విడుద‌ల చేయడానికి ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ ఈ రోజు జగిత్యాలలో ప‌ర్య‌టిస్తోన్న విష‌యం తెలిసిందే.  కోటిలింగాల పుణ్యక్షేత్రంలో బాలకృష్ణ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంత‌రం అక్క‌డి ఓ స్థానిక సినిమా థియేటర్ కి చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆ థియేట‌ర్ వ‌ద్ద‌ ఆ సినిమా ద‌ర్శ‌కుడు క్రిష్ మాట్లాడుతూ సింహం మీ మ‌ధ్య‌లో కూర్చుందని బాల‌కృష్ణ‌ను  ఉద్దేశించి అన్నారు. బాల‌య్య ఈ సినిమాను ఎందుకు త‌మ‌ చేతిలో పెట్టారో ప్రేక్ష‌కుల‌కి ఈ సినిమా  ట్రైల‌ర్ చూస్తే అర్థ‌మ‌వుతుంద‌ని అన్నారు. కోటిర‌త‌నాల వీణ తెలంగాణ‌లో కోటిలింగాల సాక్షిగా నూరోచిత్రం ట్రైల‌ర్‌ రిలీజ్ చేయ‌డానికి వ‌చ్చామ‌ని అన్నారు. నైజాం డిస్ట్రిబ్యూట‌ర్ సుధాక‌ర్ రెడ్డిని ట్రైల‌ర్ విడుద‌ల చేయాల‌ని కోరారు.

  • Loading...

More Telugu News