: ఇప్పటికీ కొత్తనోట్ల ముఖం చూడనివారి కోట్లలోనే వున్నారు!
పెద్దనోట్ల రద్దు అనంతరం కొత్తగా విడుదలైన నోట్ల మొఖం చూడనివారు దేశంలో కోట్ల మంది ఉన్నారట. నోట్ల రద్దు అయి దాదాపు 40 రోజులు అవుతున్నప్పటికీ, కొత్త రూ.2 వేలు, రూ.500 నోట్లు చూడని వారు కోట్ల మంది ఉన్నారనే విషయాన్ని లోకల్ సర్కిల్స్ అనే సంస్థ వెల్లడించింది. ఈ విషయమై సదరు సంస్థ దేశ వ్యాప్తంగా నిర్వహించిన ఒక సర్వే లో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.
* రెండు వేల నోటు లేని వాళ్లు- 41%
* రెండు వేల నోటు కలిగి ఉన్న వారు- 59%
* కొత్త రూ.500 నోటు లేని వాళ్లు- 68%
* కొత్త రూ.500 నోటు కలిగి ఉన్న వాళ్లు- 32%
* రెండు వేల నోటును దాచుకోవాలని అనుకుంటున్న వాళ్లు - 45 %
* అత్యవసరమైతేనే రెండు వేల నోటును వాడతామంటున్న వాళ్లు - 14 %
* నోట్ల రద్దుతో వ్యాపారం తగ్గిందన్న వారు- 90%