: హైదరాబాద్‌లో మళ్లీ ఐఎస్ఐఎస్ అలజడి... ఇద్దరు యువకుల అరెస్టు
హైదరాబాద్ నగరంలో మరోసారి ఐఎస్ఐఎస్ అలజడి కనిపించింది. ఆ ఉగ్రవాద సంస్థలో చేరేందుకు హైదరాబాద్ నుంచి ఇద్దరు యువకులు సిరియా వెళ్లారు. ఈ విషయాన్ని గుర్తించిన పోలీసులు వెంటనే అప్రమత్తమై, సిరియా నుంచి వారిని వెనక్కి రప్పించారు. సదరు యువకులు వరంగల్ కు చెందిన గుర్బాన్, హైదరాబాద్‌కు చెందిన హబీబుల్ రెహ్మాన్‌గా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్‌లో వారు ఎయిర్ పోర్టుకు చేరుకోగానే అదుపులోకి తీసుకొన్న తెలంగాణ పోలీసులు వారిద్దరినీ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులకు అప్పగించారు. ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది.