: దేశాన్ని ఐక్యం చేయడానికే గౌతమీపుత్రశాతకర్ణి పోరాటం చేశారు: బాలకృష్ణ
అఖండభారతావనిని పరిపాలించిన గొప్ప రాజు గౌతమీపుత్ర శాతకర్ణి అని ప్రముఖ నటుడు బాలకృష్ణ తెలిపారు. జగిత్యాలలో ఆయన మాట్లాడుతూ, గౌతమీపుత్రశాతకర్ణి సినిమా పంచభక్ష్యపరమాన్నాలంత గొప్పగా వచ్చిందని అన్నారు. భావితరాలకు ఈ సినిమా గొప్ప పుస్తకంలా నిలుస్తుందని ఆయన చెప్పారు. శాతవాహనులను ఇప్పటికీ ప్రపంచంలోని వివిధ దేశాలు తలచుకుంటాయని, తెలుగు వారి కీర్తిప్రతిష్ఠలను దిగంతాలకు వ్యాపింప చేసిన మహారాజు గౌతమీపుత్ర శాతకర్ణి అని ఆయన కొనియాడారు.
ఆయనలాగే తన తండ్రి కూడా తన వెన్నుపై తెలుగు దేశం జెండాను మోశారని ఆయన చెప్పారు. శాతవాహన సామ్రాజ్యానికి కోటిలింగాలు ముఖద్వారం వంటిదని ఆయన చెప్పారు. అందుకే ఇక్కడ ఈ సినిమా ట్రైలర్ ను ఆవిష్కరించనున్నామని ఆయన తెలిపారు. తన 100వ సినిమాగా ఈ సినిమాను చేయడం తన అదృష్టమని ఆయన చెప్పారు. తెలుగు సినీ చరిత్రలో ఈ సినిమా మరుపురాని సినిమాగా నిలిచిపోతుందని ఆయన తెలిపారు. దేశ ఏకీకరణకే గౌతమీపుత్ర శాతకర్ణి పోరాటం చేశారని ఆయన చెప్పారు. శాంతి, సుస్థిరతతో ఆయన పరిపాలించారని బాలయ్య తెలిపారు.