alster cook record: టెస్టుల్లో 11 వేల పరుగుల మార్కును చేరిన ఇంగ్లండ్ కెప్టెన్ అలెస్టర్ కుక్
చెన్నయ్ వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచు ద్వారా కెప్టెన్ అలెస్టర్ కుక్ రికార్డును నెలకొల్పాడు. ఈ టెస్టులో చేసిన పరుగుల ద్వారా కుక్ టెస్టుల్లో 11వేల పరుగుల మార్కును చేరాడు. ఈ పరుగుల్ని కుక్ 10 సంవత్సరాల 290 రోజుల్లోనే సాధించి టెస్టు ఫార్మాట్లో పదకొండు వేల పరుగుల మైలురాయిని అత్యంత తక్కువ సమయంలో చేరుకున్న బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. భారత్‌తో జరిగిన నాలుగో టెస్టు మ్యాచ్ కు ముందు 10,998 పరుగులతో ఉన్న కుక్.. ఈ రోజు
ఆట ప్రారంభంలో మరో రెండు పరుగులు చేయడం ద్వారా ఈ రికార్డును సాధించాడు. అనంతరం మ్యాచులో మరో 8 పరుగులు చేసిన కుక్ అవుటయ్యాడు.
ఇప్పటివరకు మొత్తం 140 టెస్టు మ్యాచ్లు ఆడిన కుక్ 252 ఇన్నింగ్స్ ల్లో 11వేల పరుగులు చేశాడు. అందులో మొత్తం 30 సెంచరీలు, 53 అర్ధ సెంచరీలు ఉన్నాయి. కాగా, ఈ రికార్డును టీమిండియా మాజీ ఆటగాడు సచిన్ టెండూల్కర్ 223 ఇన్నింగ్స్ లు ఆడి చేరుకున్న విషయం తెలిసిందే. అయితే సచిన్‌కు ఈ రికార్డు సాధించడానికి సుమారు 18 ఏళ్లు పట్టింది. సచిన్ 11 వేల పరుగులను 31 ఏళ్ల 10 నెలలు వయసులో చేరుకోగా, కుక్ 31 ఏళ్ల 4 నెలల వయసులోనే సాధించాడు.