: వాట్సాప్ లో సరికొత్త ఆప్షన్... ఇప్పటిదాకా యూజర్లు పడుతున్న కష్టాలకు ఫుల్ స్టాప్
వాట్సాప్ లో పొరపాటున ఏదైనా తప్పుగా టైప్ చేసిన మెసేజ్ నో, లేదా పొరపాటున పంపిన మెసేజ్ నో మనం ఏమీ చేయలేం. కేవలం మన స్మార్ట్ ఫోన్ లో మాత్రమే మనం దాన్ని తొలగించగలం. ఎవరికైతే మెసేజ్ పంపించామో... ఆ ఫొన్ నుంచి దాన్ని మనం తొలగించలేం. ఈ కారణంగా, వాట్సాప్ యూజర్లు పలు సందర్భాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇకపై ఈ బాధ పడక్కర్లేదు. ఎందుకంటే వాట్సాప్ కొత్త ఆప్షన్ తీసుకురాబోతోంది. మనం పంపించిన మెసేజ్ ను ఎడిట్ చేయడం కానీ, లేదా పూర్తిగా తొలగించడం కానీ ఇకపై మన చేతుల్లోనే ఉంటుంది. మనం ఎడిట్ చేస్తే, అవతలి ఫోన్లో కూడా ఎడిట్ చేసిన మెసేజే ఉంటుంది. మనం డిలీట్ చేస్తే, అవతలి ఫోన్ నుంచి కూడా డిలీట్ అవుతుంది.
వాబీటాఇన్ఫో (WABetaInfo) సంస్థ తెలిపిన వివరాల ప్రకారం... వాట్సప్ బీటా వర్షన్ లో కొత్తగా రివోక్ అనే బటన్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేస్తే, మనం పంపిన మెసేజ్ ఆగిపోతుంది. కేవలం మెసేజ్ లు మాత్రమే కాదు... మనం పంపిన డాక్యుమెంట్లు, ఫొటోలు, వీడియోలను కూడా ఇలాగే తీసివేయొచ్చు.