: రెస్టారెంట్ బిజినెస్ లోకి అడుగుపెట్టిన టాలీవుడ్ యంగ్ హీరో


సినీ స్టార్లు రకరకాల వ్యాపారాల్లోకి అడుగుపెట్టడం సర్వసాధారణమే. ఇప్పటికే ఎంతో మంది స్టార్లు ఎన్నో వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టారు. తాజాగా ఈ జాబితాలోకి టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ కూడా చేరాడు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10లో 'వివాహ భోజనంబు' అంటూ అచ్చమైన తెలుగు వంటకాల రుచిని చూపించడానికి రెడీ అయ్యాడు. నిన్న సాయంత్రం ఈ రెస్టారెంటును హీరోయిన్ రెజీనాతో కలసి సందీప్ కిషన్ ప్రారంభించాడు. ఈ సందర్భంగా సందీప్ మాట్లాడుతూ, అద్వితీయమైన రుచులను అతిథులకు అందించాలనే ఉద్దేశంతోనే ఈ రెస్టారెంట్ ను ప్రారంభించినట్టు తెలిపాడు. గతంలో ఎన్నడూ చూడని రుచులను ఈ రెస్టారెంట్ లో చూస్తారని చెప్పాడు. 

  • Loading...

More Telugu News