: కోహ్లీ... ఈ పేరు పెట్టుకో, నీకు బాగా సూటవుతుంది: సెహ్వాగ్


అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నా... ట్విట్టర్లో రెగ్యులర్ గా అందరితో టచ్ లో ఉన్నాడు డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ వీరేంద్ర సెహ్వాగ్. టీమిండియాపైన, భారత క్రికెటర్లపై ఎవరైనా కామెంట్ చేస్తే ట్విట్టర్లోనే చెలరేగిపోతుంటాడు సెహ్వాగ్. ఇదే సమయంలో, మన ఆటగాళ్లపై ఛలోక్తులు విసరడం, పొగడ్తలు కురిపించడం అన్నీ చేస్తుంటాడు. తాజాగా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీని పేరు మార్చుకోమంటూ సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. గ్రౌండ్ లో చెలరేగిపోతున్న విరాట్ కోహ్లీ... ఎన్నో రికార్డులను అధిగమిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా, కోహ్లీని ప్రశంసిస్తూ సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. కోహ్లీ అద్భుతమైన బ్యాట్స్ మెన్ అని, మెరుపులాంటి వాడని కితాబిచ్చాడు. అంతేకాదు, అతని పేరును 'మెరుపు'గా మార్చుకోవాలని కూడా సూచించాడు. 

  • Loading...

More Telugu News