: ఎయిడ్స్ బాధిత చిన్నారుల కోసం క్రికెట్ ఆడిన సినీ నటి స్నేహ
వివాహానంతరం సినిమాలు తగ్గించిన సినీ నటి స్నేహ ఎయిడ్స్ బాధిత చిన్నారుల కోసం క్రికెట్ ఆడింది. ఎయిడ్స్ బాధిత చిన్నారుల సహాయార్థం నిధుల సేకరణలో భాగంగా గత నెల 27 నుంచి క్రికెట్ టోర్నీ నిర్వహిస్తున్నారు. చెన్నయ్ లోని వైఎంసీఏ మైదానంలో నిర్వహిస్తున్న ఈ టోర్నీని ఎయిడ్స్ బాధిత చిన్నారులు వీక్షించి హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారిని ఉత్సాహపరిచేందుకు, వారిలో స్పూర్తి నింపేందుకు మైదానానికి వచ్చిన స్నేహ బ్యాటు చేతబట్టి క్రికెట్ ఆడింది. ఈ పోటీలను తిలకించేందుకు పలువురు సినీ ప్రముఖులు వైఎంసీఏ మైదానికి రావడం విశేషం. దీంతో ఎయిడ్స్ బాధిత చిన్నారుల ముఖాల్లో హర్షం వ్యక్తమైంది.