: నేటితో ముగియనున్న పార్లమెంటు సమావేశాలు


పార్లమెంటు సమావేశాలు నేటితో ముగియనున్నాయి. పెద్దనోట్ల రద్దుపై చర్చకు పట్టుబడుతూ అధికార, విపక్షాలు ఆందోళన చేపడుతున్న విచిత్రమైన పరిస్థితి పార్లమెంటులో నెలకొంది. లోక్ సభ, రాజ్యసభ సభ్యులు ఒకరిపై మరొకరు నిందారోపణలు చేసుకుంటూ గందరగోళం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీనియర్ లోక్ సభ సభ్యుడు, బీజేపీ కురువృద్ధుడు ఎల్.కే. అద్వానీ తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఆవేదనను తాను అర్థం చేసుకున్నానని స్పీకర్ సుమిత్రా మహాజన్ తెలిపారు. ఈ క్రమంలో నేటి పార్లమెంటు సమావేశం సజావుగా సాగుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. 

  • Loading...

More Telugu News