: గూగుల్ సెర్చ్ లో నెంబర్ వన్ గా నిలిచిన బన్నీ!


నెంబర్ వన్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, నెంబర్ టూ ప్రిన్స్ మహేష్ బాబు, నెంబర్ త్రీ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, నెంబర్ ఫోన్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, నెంబర్ ఫైవ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్... ఈ జాబితా చూసి ఆశ్చర్యపోయారా?  అయితే, ఇది వాళ్ల పొజిషన్ కు చెందిన ర్యాంకింగ్ కాదు. ఈ ఏడు టాలీవుడ్ నటుల్లో ఎవరికోసం ఎక్కువగా గూగుల్ లో సెర్చ్ చేశారన్న దానిపై గూగుల్ ర్యాంకులు విడుదల చేసింది.

ఫేస్ బుక్ లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన వ్యక్తిగా ట్విట్టర్ లో ప్రవేశించిన అల్లు అర్జున్ అతితక్కువ సమయంలో మిలియన్ అభిమానులను సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఏడు గూగుల్ లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన నటుడిగా అల్లు అర్జున్ నెంబర్ వన్ స్థానంలో నిలిచాడు. కాగా, బన్నీకి కోలీవుడ్, మాలీవుడ్ లో కూడా భారీ ఫాలోయింగ్ ఉంది. ప్రధానంగా మలయాళంలో విశేషమైన ఆదరణ ఉంది. ఆ తర్వాత మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్, రాం చరణ్ నిలిచారు. 

  • Loading...

More Telugu News