: కోల్ కతాలో ఆర్బీఐ గవర్నర్ పై దాడికి యత్నం!
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాలోని సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ కు చేదు అనుభవం ఎందురైంది. పెద్దనోట్ల రద్దును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి వాస్తవ పరిస్థితులు వివరించేందుకు ఉర్జిత్ పటేల్ కోల్ కతా చేరుకున్నారు. ఈ సందర్భంగా ఉర్జిత్ పటేల్ పై పలువురు దాడికి యత్నించారు. నానా దుర్భాషలాడుతూ ఆయనపైకి దూసుకెళ్లారు. ఊహించని పరిణామంతో ఉర్జిత్ పటేల్ బిత్తరపోయారు. భద్రతా సిబ్బంది రంగప్రవేశం చేసి, ఆయనను అక్కడి నుంచి సురక్షితంగా తీసుకెళ్లారు. అనంతరం ఆయన దీదీతో సమావేశమయ్యారు.