stallin: జయలలిత మృతిపై అనుమానాలున్నాయి... శ్వేతపత్రం విడుదల చేయాలి: స్టాలిన్ డిమాండ్


తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతిపై అనుమానాలున్నాయని డీఎంకే నేత స్టాలిన్ తెలిపారు. చెన్నైలో ఆయన మాట్లాడుతూ, ఆమె మృతిపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చెయ్యాలని ఆయన డిమాండ్ చేశారు. ఆమె చివరి రోజుల్లో అపోలో ఆసుపత్రిలో చోటుచేసుకున్న పరిణామాలను వెల్లడించాలని ఆయన అన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం కూడా విచారణ చేసి వివరాలు వెల్లడించాలని ఆయన కోరారు. ఈ నెల 5న జయలలిత మృతిచెందిన సంగతి తెలిసిందే. అయితే ఆమె మృతిపై అనుమానాలు ఉన్నాయని, చివరి రోజుల్లో ఆమెను చూసేందుకు ఆసుపత్రిలోకి ఎవరినీ అనుమతించలేదని, చివరి రోజుల్లో ఏం జరిగిందో ఎవరికీ తెలియదని ఓ స్వచ్ఛంద సంస్థ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్టాలిన్ డిమాండ్ ఆసక్తి రేపుతోంది. 

stallin
jayalalitha
tamilnadu
  • Loading...

More Telugu News