: మెల్ బోర్న్ లో విశాఖ విద్యార్థి దుర్మరణం
ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ లో తెలుగు విద్యార్థి దుర్మరణం చెందాడు. విశాఖపట్టణానికి చెందిన అనుదీప్ అనే విద్యార్థి ఈ ఏడాది మార్చిలో అక్కడికి వెళ్లాడు. మెల్ బోర్న్ యూనివర్శిటీ లో ఎంఎస్ చేస్తున్నాడు. అక్కడ ఉన్న చెరువులో ఈత కొట్టేందుకని నిన్న సాయంత్రం తన స్నేహితులతో కలిసి వెళ్లాడు. అయితే, అక్కడి ఉష్ణోగ్రత ప్రస్తుతం మైనస్ డిగ్రీలలో ఉండటంతో, చెరువులో ఉన్న మంచుగడ్డల్లో ఇరుక్కుపోయిన అనుదీప్ మరణించాడు. ఈ విషయం అతని తల్లిదండ్రులకు గురువారం తెల్లవారుజామున తెలిసింది. కొడుకు మరణవార్తతో ఆ కుటుంబం కుంగిపోయింది. కాగా, అనుదీప్ తండ్రి నేవీలో పనిచేస్తున్నారు.