: రణబీర్ తో ఎందుకు విడిపోయిందో క్లియర్ గా చెప్పేసిన కత్రినా కైఫ్


బాలీవుడ్ యంగ్ హీరో, నటి కత్రినా కైఫ్ ల ప్రేమాయణం ఏ రేంజ్ లో కొనసాగిందో అందరికీ తెలిసిందే. విదేశీ బీచుల్లో కూడా అప్పట్లో వీరే కనబడ్డారు. ఆ తర్వాత ఏం జరిగిందో కానీ, ఇద్దరూ విడిపోయారు. వారిద్దరూ కలసి కనపడింది కూడా లేదు. అయితే, రణబీర్ తో తాను ఎందుకు విడిపోయిందో తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది క్యాట్.

అబద్ధాలు ఆడడంలో రణబీర్ ను మించిన వాడు లేడని ఈ సందర్భంగా కత్రిన మండిపడింది. కుటుంబానికే అతను ఎక్కువ విలువ ఇస్తాడని... వారి తర్వాతే మరెవరైనా అని... ఇలాంటి వాడిని ఏ అమ్మాయి మాత్రం ఇష్టపడుతుందని ప్రశ్నించింది. రణబీర్ ను మరోసారి నమ్మడం అంటూ ఉండదని... ఇకపై తాము కలవమని చెప్పింది. అతడిని వేరే ఏ అమ్మాయి కూడా ఇష్టపడదని... ప్రేమాదోమా అంటూ ఏ అమ్మాయి వెంట పడకుండా, ఇంట్లోవారు చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అతనికి మంచిదని చెప్పింది.

  • Loading...

More Telugu News