: ఈ నెలాఖరులోగా బీబీసీ తెలుగు వెబ్ ఛానెల్ !
ఈ నెలాఖరులోగా బీబీసీ తెలుగు వెబ్ ఛానెల్ ను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా బీబీసీ ఇండియన్ లాంగ్వేజెస్ హెడ్ రూపాజా మీడియాతో మాట్లాడుతూ, ‘తెలుగు’ తో పాటు మరాఠీ, గుజరాతి, పంజాబీ ప్రాంతీయ భాషల్లోనూ వెబ్ ఛానెళ్లను అందుబాటులోకి తీసుకువస్తున్నామని చెప్పారు. లండన్, ఢిల్లీ కేంద్రంగా నూతన ఉద్యోగాల నియామకాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. బీబీసీ ప్రాంతీయ భాషలకు సంబంధించి నేరుగా నియామకాలు జరుగుతాయని చెప్పారు.