: 'బొట్టు' పెట్టి రిక్వెస్ట్ చేస్తున్న జీహెచ్ఎంసీ
సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ కు సంబంధించి జీహెచ్ఎంసీ వినూత్న ప్రచారాన్ని ప్రారంభించింది. స్వచ్ఛ హైదరాబాద్ లో భాగంగా తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో, జనాల్లో చైతన్యాన్ని తీసుకురావడానికి... జీహెచ్ఎంసీ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి, మహిళలకు బొట్టు పెట్టి తడి, పొడి చెత్తను వేర్వేరు డబ్బాల్లో వేయాలని విన్నవించారు. ఈ ప్రచారానికి మంచి స్పందన వస్తోందని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి తెలిపారు. పార్కులు, హోటళ్లు, కాలనీలు, రెస్టారెంట్లలో కంపోస్ట్ ఎరువుల తయారీకి ప్రత్యేకంగా గుంతలు తవ్వించుకోవాలనే దిశగా అవగాహన కల్పిస్తున్నట్టు చెప్పారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ నిబంధనలు పాటించడం వల్ల హైదరాబాదును స్వచ్ఛ హైదరాబాద్ గా మారుస్తామని తెలిపారు.