: ప్రాక్టీస్‌లో గొడవకు దిగిన పాక్ క్రికెటర్లు.. విచారణకు ఆదేశించిన పీసీబీ
నేటి నుంచి ఆస్ట్రేలియాతో జరగనున్న టెస్ట్ మ్యాచ్ కోసం ప్రాక్టీస్ చేస్తున్న పాక్ జట్టులోని ఇద్దరు ఆటగాళ్ల మధ్య మొదలైన వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. ప్రాక్టీస్‌లో భాగంగా ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడుతున్న జట్టు సభ్యుల్లోని వాహబ్ రియాజ్, యాసిర్ షా మధ్య మాటామాట పెరగడంతో ఘర్షణ పడ్డారు. గొడవ మరింత ముదిరేలా ఉండడంతో అప్రమత్తమైన సహచరులు వెంటనే వారిని అడ్డుకుని సముదాయించారు. ఈ ఘటనపై పాక్ క్రికెట్ బోర్డు విచారణకు ఆదేశించింది. గురువారం నుంచి బ్రిస్బేన్‌లో ఆస్ట్రేలియా-పాక్ మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. 1988 నుంచి ఈ మైదానంలో కంగారూలకు ఓటమన్నదే లేదు.