: ఓనర్ ప్రాణాలు కాపాడి హీరోగా మారిన కుక్క


 విశ్వాసానికి మారుపేరుగా కుక్కను పరిగణిస్తాం. ఇది ఎన్నో సందర్భాల్లో నిరూపితమైంది కూడా. అలాగే ఫిలడెల్ఫియాలో తన యజమానిని రక్షించి, హీరోగా మారింది యెలాండా అనే పేరు గల కుక్క. యెలాండాను అంధుడు, వృద్ధుడు అయిన ఓ వ్యక్తి పెంచుకుంటున్నారు. ప్రమాదవశాత్తు ఆయన ఇంటికి నిప్పు అంటుకుంది. ఆ సమయంలో అతని కుటుంబ సభ్యులెవరూ ఇంట్లో లేరు. దాంతో ఆయన ఇంట్లో చిక్కుకుపోయారు.

దీంతో అప్రమత్తమైన యెలాండా 911 కు కాల్ చేసి, మొరుగుతూ ఉంది. దీంతో అప్రమత్తమైన ఫైర్ సిబ్బంది సదరు కాల్ వచ్చిన అడ్రెస్ కి వెళ్లి చూడగా, మంటల్లో చిక్కుకున్న ఇంటిని గుర్తించారు. దీంతో వెంటనే అతనిని ఫైర్ సిబ్బంది రక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, తన కుక్క తనను గతంలో రెండు సార్లు కాపాడిందని గుర్తుచేసుకున్నారు. 2013లో దొంగల బారినుంచి కాపాడిందని, అలాగే 2015లో టూర్ కు వెళ్లినప్పుడు స్పృహ తప్పి పడిపోయినప్పుడు 911 కాల్ చేసి కాపాడిందని ఆయన తెలిపారు. దీంతో యెలాండా ఫిలడెల్ఫియాలో హీరో అయిపోయింది. 

  • Loading...

More Telugu News