: హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై కొరడా ఝళిపిస్తోన్న జీహెచ్‌ఎంసీ సిబ్బంది
హైదరాబాద్‌లో శిథిలావస్థకు చేరుకున్న భవనాలు, అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు. ఇటీవలే నానక్‌రాంగూడతో పాటు ఉప్పల్ లో నిర్మాణంలో ఉన్న భవనాలు కుప్పకూలిన సంగతి తెలిసిందే. దీంతో కదిలిన జీహెచ్ఎంసీ సిబ్బంది నగరంలో ఉన్న అక్రమ నిర్మాణాలను పలుచోట్ల తొలగించారు. నగరంలో హెచ్‌ఎండీఏ పరిధిలో నిర్మించిన పలు అక్రమ నిర్మాణాలను కూల్చి వేసే పనిలో పడ్డారు. నగరశివారులోని హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్, పెద్ద అంబర్‌పేట, కూంట్లూరు, తట్టి అన్నారం తదితర ప్రాంతాల్లో నిర్మిస్తోన్న అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు.